కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే లక్ష ఉద్యోగాలకు నాది హామీ – కొడంగల్ లో రేవంత్…!

Revanth Reddy Road Show At Kodangal

నిన్న తెల్లవారుజామున పోలీసుల అక్రమ అరెస్టుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం విడుదలయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా నిన్న ప్రచారం చేయడానికి వీలు కాకపోవడంతో ఈరోజు తన నియోజకవర్గం అయిన కొడంగల్ లో తన ప్రచారాన్ని నిర్వహించారు రేవంత్ రెడ్డి. తన ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని బొమరస్ పేట్ లో నిర్వహించిన రోడ్ షో లో రేవంత్ రెడ్డి తెరాస పార్టీ ని దుయ్యబట్టారు. తన ప్రసంగంలో మాట్లాడుతూ “నా నియోజకవర్గంలో నన్ను ఓడించాలని కేసీఆర్ చెప్తుండు, అది జరిగే పనేనా అని కేసీఆర్ ఆలోచించాలా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించమంటున్నాడా? రేవంత్ రెడ్డి అనే నేను తొమ్మిది ఏళ్ళ మునుపు కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వలన ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ గుర్తించే స్థాయికి చేరుకున్నా.

revanth-reddy-campaign

కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసిండో నేను అడుగుతున్నా, వికారాబాద్ జిల్లాకు డబల్ రోడ్ కూడా ఎందుకు ఇవ్వలేదో, బొమరస్ పేట్ పెద్ద చెరువును ట్యాంక్ బండ్ గా చేయాలన్న ప్రజల కోరికను ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నా, ఇంటింటికి నల్లా నీళ్లు రాకుంటే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. ఇంటికో ఉద్యోగం అని ప్రకటించి, తన ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు కల్పించుకున్నాడు. యూనివర్సిటీ విద్యార్థుల కృషితో, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కసారైనా యూనివర్సిటీ కి వెళ్లాడా, మనది ప్రజా కూటమి, కేసీఆర్ ది కుటుంబ కూటమి. ఆ కుటుంబ కూటమిని ఓడిద్దాం. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించి, 100 అడుగుల గుంత తీసి పూడుద్దాం. తెలంగాణ ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే, ప్రజా కూటమిని గెలిపించండి.

revanth-speech

ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత నాది” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటున్నా, లగడపాటి సర్వే ప్రజకూటమికి అనుకూలంగా ఉన్నా, రేవంత్ రెడ్డి అరెస్టు పైన డీజీపీ స్వయంగా వచ్చి, వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం అనేది కేసీఆర్ నియంత పాలనకు అద్దం పడుతున్నా, ప్రజలు వేటిని పరిగణలోకి తీసుకోబోతున్నారో, ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయబోతున్నారో అనేది ఊహించలేని అంశంగా మారింది. ఏదేమైనా 2014 ఎన్నికలలో లాగా తెరాస పార్టీ ని చూసి, ఓటు గుద్దే పరిస్థితులు ఇప్పుడు లేవు. నియోజకవర్గంలోని అభ్యర్థుల గుణగణాలను పరిగణలో తీసుకుంటారనే విషయం [ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, తేటతెల్లం అవుతుంది.