కేసీఆర్ పచ్చి అవకాశవాది – ఎలాగో వివరించిన చంద్రబాబు…!

AP Cm Chandrababu Transfer Of Cash To Farmers

తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు ఈరోజుతో ముగియనుండటంతో ప్రజకూటమి తరపున ఆంధ్ర ప్రభావం ఎక్కువకలిగిన భద్రాద్రి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట లో నిర్వహించిన రోడ్ షో లో ప్రసంగిస్తున్న చంద్రబాబు కేసీఆర్ పైన పలు విమర్శలు చేశారు. తన ప్రసంగంలో కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను వివరిస్తూ, తొలుత కాంగ్రెస్ పార్టీ తో పొత్తుతో వెలుగులోకి వచ్చిన కేసీఆర్, తరువాత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయాన్నీ గుర్తుచేశారు. మరల తనకి మంత్రి పదవి కట్టబెట్టలేదన్న అక్కసుతో ఇంటింటికి ఉద్యోగం అని ప్రకటించి, ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను తన స్వలాభం కోసం ఉపయోగించుకొని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కి వెన్నుపోటు పొడిచి మరి అధికారంలోకి వచ్చిన ఘనత కేసీఆర్ ది అని, కేసీఆర్ కోరుకున్న మంత్రి పదవి ని తాను ఇచ్చుంటే టీడీపీ లోనే ఉండేవాడని ఎద్దేవా చేశారు.

kcr-cm

నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేసిందేమిటో ప్రజలకు తెలియడం లేదని, తన కుటుంబం ఉండడానికి వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ ని నిర్మించుకున్న కేసీఆర్, ఇల్లు లేని ప్రజలకు కనీసం ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా సచివాలయంలో ఉండటానికి ఇష్టపడకుండా, తన ఫామ్ హౌజ్ నుండే పాలన చేస్తున్న కేసీఆర్ ఎంత నిరంకుశవాదో ప్రజలు తెలుసుకోవాలని, ఇంటింటికి నల్లా నీళ్లు అన్న మాట కూడా నిలుపుకోకుండా ప్రజలను కష్టపెట్టిన కేసీఆర్, అతడి కుటుంబ కూటమి ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతుందో తెలియట్లేదని వాపోయారు.2014 లో విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను ప్రాజెక్టుల రీడిజైను అంటూ, కమీషన్ల కోసం కక్కుర్తి పడి, అప్పుల రాష్ట్రంగా చేశాడని, లోటు బడ్జెట్ తో అప్పగించిన ఆంధ్రప్రదేశ్ లో తాను పది లక్షల ఇల్లు కట్టించానని, తెలంగాణాలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం అప్లై చేసుకున్న, ఏ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన ఘనత నాదేనని గర్వంగా చెప్పుకోగలనని, యువత కలల కోసం హైదరాబాద్ ని ఐటీ రాజధానిగా నిర్మిస్తే, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ లు హైదరాబాద్ ని అనుభవిస్తున్నారని, తెలంగాణ లోని ఏ సంక్షేమ పథకం ప్రజలకు పూర్తిస్థాయి లో లబ్ది చేకూర్చడం లేదని, తెలంగాణ రావడం వలన ఎవరైనా బాగుపడ్డారంటే, అది కేసీఆర్ కుటుంబమేనని చంద్రబాబు విమర్శించారు.

kcr-chandrabbabbu

కేసీఆర్ కుటుంబ పాలనని విమర్శిస్తున్న చంద్రబాబు మాటల్లో నిజమున్న, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేస్తున్నదేమిటి? తన కొడుకు నారా లోకేష్ ను ఎమ్మెల్సీ ని చేసి, ఐటీ శాఖ మంత్రిగా చెయ్యలేదా? రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన కోడలు నారా బ్రాహ్మణి కూడా ఎన్నికల్లో నిలబడబోతుందన్న వార్తల్లో నిజంలేదా? నారా లోకేష్ కి అవినీతి మరకలు ఉన్న విషయాన్నీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేత జగన్, జనసేన నేత పవన్ కళ్యాణ్ లు స్వయంగా ఆరోపించలేదా? చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు (ముఖ్యంగా అన్న కాంటీన్) ఎంత నాసిరకంగా ఉన్నాయో ప్రజలు గమనించడం లేదా? రాజధాని నిర్మాణం అంటూ లక్షల ఎకరాల ప్రజల భూములను కబ్జా చేసినట్లుగా, బలవంతంగా లాక్కోలేదా? ఇన్ని విమర్శలున్న చంద్రబాబు మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసించకున్నా, కేసీఆర్ నియంత పాలనతో విసుగుచెందినా, సరైన ప్రత్యామ్న్యాయం ప్రజాకూటమేనా అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు.

KCR Fair on Chandrababu