హిట్ ట్రాక్ లో ఉన్న వరుణ్ తేజ్

హిట్ ట్రాక్ లో ఉన్న వరుణ్ తేజ్

2019 సంవత్సరం లో మెగా ఫ్యామిలీ నుండి ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం తోలి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ నటన ఆకట్టుకున్నప్పటికీ చిత్ర కథని దర్శకుడు సరిగ్గా చెప్పలేకపోవడం, కథనం సరిగా లేకపోవడం తో ఈ చిత్రం ప్లాప్ అయి, కలెక్షన్లు సాధించలేకపోయింది.

అయితే వరుణ్ తేజ్-వెంకటేష్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఈ చిత్రం.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కి కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైన మరో మెగా మూవీ సైరా నరసింహ రెడ్డి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయి తెలుగు నాట ఆశించిన వసూళ్ళని రాబట్టింది. కానీ ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, మిగతా భాషల్లో అంతగా వసూళ్లు చేయలేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత గాద ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలని మిగిల్చింది అని సమాచారం.

గబ్బర్ సింగ్ చిత్రం తో హిట్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిన హరీష్ శంకర్, వాల్మీకి చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్ ప్రతినాయక ఛాయలున్న హీరో పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడని చెప్పాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా మంచి నటనని కనబరిచారు. అయితే టైటిల్ వివాదం అయినప్పటికీ ఈ చిత్రం వసూళ్లు మాత్రం తగ్గలేదు. అయితే ఈ ఏడాది రెండు హిట్లతో వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలిలో మొనగాడు అని అనిపించుకుంటున్నాడు. ఎఫ్2, వాల్మీకి చిత్రాలతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ లో వున్నాడు.