తొలిప్రేమ vs తొలిప్రేమ

varun tej tholi prema teaser release on tomorrow

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒకప్పుడు అంటే దాదాపు 20 ఏళ్ళ కిందట బాబాయ్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో కుర్రకారు గుండెల్లో కుర్చీ వేసుకు కూర్చున్నాడు. ఇప్పుడు అబ్బాయి వరుణ్ తేజ్ అదే టైటిల్ తో వస్తున్నాడు.అప్పట్లో తొలిప్రేమ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. అప్పటికి పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు చేసినప్పటికీ భారీ హిట్ ఇంకా సొంతం కాలేదు. ఇక దర్శకుడు కరుణాకరన్ కి అది తొలి సినిమా. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇందులో పవన్ తో పాటు హీరోయిన్ గా చేసిన కీర్తి రెడ్డి , పవన్ చెల్లెలు వేషం వేసిన వాసుకి, పవన్ పెదనాన్న క్యారెక్టర్ వేసిన సీనియర్ కమెడియన్ నగేష్, పవన్ ఫ్రెండ్ గా చేసిన వేణు మాధవ్ తో అందరికీ ఈ సినిమాతో భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మూడునాలుగేళ్లపాటు ఈ తరహా సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నించినా ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయారు.

Varun-Tej-Starring-Tholi-Pr

ఇక ఇప్పుడు అబ్బాయి వరుణ్ తేజ్ కూడా అప్పటి బాబాయ్ టైటిల్ తొలిప్రేమ తో రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి ముందు వరుణ్ తేజ్ కొన్ని సినిమాలు చేసినా ఇంకా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే వున్నాడు. కంచె హిట్ క్రిష్ ఖాతాలో , ఫిదా క్రెడిట్ శేఖర్ కమ్ముల , సాయి పల్లవి ఖాతాలో పడడంతో వరుణ్ కి తగ్గ స్థాయిలో పేరు ఇంకా రాలేదు. ఇలాంటి టైం లో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరిని నమ్ముకుని తొలిప్రేమ సినిమాకు ఓకే చెప్పాడు వరుణ్. సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా టీజర్ రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బాబాయ్ లాగానే అబ్బాయి కెరీర్ కూడా స్పీడ్ అందుకుంటుందని మెగా ఫాన్స్ ఆశపడుతోంది. వారి కోరిక నెరవేరాలని తెలుగు బులెట్ కూడా ఆకాంక్షిస్తోంది.