జైసింహా ఆడియో రిలీజ్ ఎప్పుడో, ఎక్కడో తెలుసా ?

jai Simha audio release on december 24 at Vajra Grounds , vijayawada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ సినిమా జైసింహా ఆడియో ఫంక్షన్ వేదిక , డేట్ ఖరారు అయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఆడియో ఫంక్షన్స్ నిర్వహిస్తున్న బాలయ్య ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. విజయవాడలోని వజ్ర మైదానంలో జైసింహా ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 న ఈ ఆడియో విడుదల వేడుక నిర్వహించడానికి విజయవాడలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. పోలీస్ శాఖ అనుమతి తో పాటు ఇతరత్రా పనులు చురుగ్గా చేస్తున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిధి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

ఇక ఈ సినిమాకు గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత సి .కళ్యాణ్ , దర్శకుడు కె.ఎస్. రవికుమార్ సహా చిత్ర యూనిట్ అంతా విజయవాడ ఆడియో వేడుకలో పాలుపంచుకునే అవకాశం వుంది. కృష్ణా, గుంటూరు , ప్రకాశం , వెస్ట్ గోదావరి నుంచి బాలయ్య ఫాన్స్ ఈ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరు అయ్యే అవకాశం ఉందట. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు వుండాలని నిర్మాతకు బాలయ్య చెప్పినట్టు తెలుస్తోంది.