కుర్ర హీరోల గుట్టు బయటపెట్టిన అఖిల్.

akkineni-akhil-planned-for-a-party-with-his-industry-friends

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అఖిల్ వయసులో చిన్నవాడైనా సాటి హీరోల ని అంచనా వేయడంలో గట్టివాడే. హలో రిలీజ్ కి ముందు ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వస్తున్న అఖిల్ ఇప్పటిదాకా కాస్త గుట్టుగా వుండే విషయాల గురించి ఏ ఫిల్టర్ లేకుండా బయటకు చెప్పేసాడు. సినిమా ఫీల్డ్ లో కుర్ర హీరోలు పార్టీలు చేసుకుంటారా అనుకునే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే సమాచారం అఖిల్ మాటల్లో బయటపడింది. అఖిల్ బయటపెట్టిన ఆ సీక్రెట్స్ ఇవే .

Akhil-Akkineni

“ రానా తో కలిసి పార్టీ చేసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఆ పార్టీల్లో మేము ఎక్కువగా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటాం. ఇక ప్రభాస్ కూడా పార్టీకి వస్తే ఆ కిక్ వేరు. నాకు, రానాకు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్. పార్టీ ఉంటే మాత్రం ముందుగా రామ్ చరణ్ కి ఫోన్ చేస్తాం. ఇలా మా బ్యాచ్ అంతా పార్టీలో కూల్ గా ఉంటాం. కానీ మంచు మనోజ్ , సాయి ధరమ్ తేజ్ వస్తే అల్లరి అల్లరి చేసేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం “ అని అఖిల్ చెప్పిన మాటలతో కుర్ర హీరోల గుట్టు బయటపడింది. పార్టీల్లో ఎవరెవరు ఎలా వుంటారో అర్ధం అయిపోయింది.