పవన్ కోసం చిరు, వెంకీ, ఎన్టీఆర్ ?

Chiru Venkatesh and NTR to attend agnathavasi movie audio Function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం 25 కావడంతో, త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పడు అదే కంబో లో మూవీ రావటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అతి తక్కువ సమయంలోనే కోటి వ్యూస్ ని రాబట్టింది. ఈ నెల19న హైదరాబాద్ లో‘అజ్ఞాతవాసి’ఆడియో రిలీజ్ చేయలని మూవీ యూనిట్ భావించింది, ఇప్పటికే మూవీ ఆడియో రిలీజ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఆడియో కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరగనుంది.

ఈ ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలియగానే… ‘అజ్ఞాతవాసి’ఆడియో పాస్ ల కోసం పవన్ ఫ్యాన్స్ ‘జనసేన’ కార్యాలయం వద్ద, ‘నిర్మాత’ కార్యాలయం వద్ద కుప్పలు తెప్పలుగా వచ్చారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు రంగంలోకి దిగారు, అప్పటికీ పవన్ ఫ్యాన్స్ ని అదుపు చేయలేని పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే…  ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కర్యాక్రమం కి చిరంజీవి ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ కానున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ కార్యక్రామానికి మరో ఇద్దరు హీరోలు రాబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేష్ – జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తో తర్వాతి సినిమాలు చేయబోతున్న హీరోలు వెంకటేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ అడగటం వలనే ఈ కర్యాక్రమం కి వెంకీ, ఎన్టీఆర్ ఈ వేడుకలో హాజరుకానున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ఈ వార్తలపై దర్శకనిర్మాతలు, మూవీ యూనిట్ గాని నోరు తెరవలేదు. అయితే ఈ వేడుకకు `అజ్ఞాతవాసి` యూనిట్ సభ్యులు మాత్రమే రాబోతున్నారని వేరే అతిథులెవర్నీ పిలవడం లేదని మరో పుకారు బలంగా వినిపిస్తోంది. అసలు ఈ ఫంక్షన్ ని ఎవరెవరు వస్తున్నారో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేసి చూడాల్సిందే…