వెజ్ హలీం ఇంటిలోనే చేసుకోండిలా !

Vegetarian Haleem Recipe in Homemade

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంజాన్ ముస్లిమ్ సోదరులకు పవిత్రమైన మాసం. పగలంతా నిష్టగా ఉపవాసం పాటించి సాయంత్రం ఇఫ్తార్ లో ఆహారాన్ని తీసుకుంటారు. ఉదయం నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. అందుకే వారు ఇఫ్తార్ లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు. రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు.హలీమ్ లో కూడా మంచి పోషక విలువలున్నాయి.పప్పు ధాన్యాలు,మాంసం వేసి వండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే సమకూరుతుంది. కానీ మాంసాహారం తినని మిగతా మతాల వారి కోసం శాఖాహార హలీం చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం

కావాల్సిన పదార్ధాలు

గోదుమ రవ్వ : 3/4 కప్పు,
మైసూర్‌ పప్పు : 1/2 కప్పు,
పెసర పప్పు : 1/2 కప్పు,
శనగపప్పు : 1/2 కప్పు,
సోయా గింజలు : 1/2 కప్పు,
నూనె : 2 చెంచాలు,
ఏలకులు : 4,
దాల్చిన చెక్క : 4 ముక్కలు,
లవంగాలు : 4,
సాజీరా : 1/2 కప్పు,
వెల్లుల్లి పేస్ట్‌ : రెండు చెంచాలు,
అల్లం పేస్ట్‌ : రెండు చెంచాలు,
ఉల్లిపాయల పేస్ట్‌ : 1/2 కప్పు,
కారం : స్పూన్‌,
దనియాల పొడి : రెండు చెంచాలు,
పచ్చి బటానీల పేస్ట్‌ : చెంచా,
ఉప్పు : తగినంత.
తయారు చేయు విధానం

—గోదుమ రవ్వను ఓ గంట పాటు నీటిలో నానబెట్టండి. తరువాత నీరు ఒంపి నాలుగు కప్పుల మంచినీరు పోయండి.
—పప్పులన్నీ వేసి కుక్కర్‌లో అర గంట ఉడికించండి.
—వేడినీటిలో సోయా గింజలను 20 నిమిషాలు నానబెట్టాలి. నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోవాలి.
—ఇప్పుడు గిన్నెలో ఆయిల్‌ పోసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసి కలపాలి.
—రెండు నిమిషాల తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. తరువాత ఉల్లిపాయల పేస్ట్‌ కూడా వేసి కలయబెట్టాలి.
—ఇప్పుడు కారం, దనియాల పొడి, పచ్చి బఠానీలు వేయాలి.
—ఇప్పుడు ముందు ఉడికించి పెట్టుకున్న గోదుమ రవ్వ, పప్పుల మిశ్రమాన్ని కలపాలి.
—దీనిలో సోయా గింజలను వేయాలి. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. రుచికి సరిపోయేంత ఉప్పు కలిపి 5 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. ఇక వేడి వేడి వెజిటబుల్‌ హలీమ్‌ రెడీ…