వెంకయ్యని చూసి మోడీ ఏడ్చాడా ?

venkaiah naidu visit hyderabad after nomination as india vice president

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్యని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి ప్రధాని మోడీ ఆయన్ని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారని విస్తృతంగా సాగుతున్న ప్రచారం. అయితే బీజేపీ ఈ వాదనని కొట్టిపారేస్తోంది. సాక్షాత్తు బాధితుడు అని అందరు చెబుతున్న వెంకయ్య సైతం బీజేపీ వాదనతో ఏకీభవిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన కీలక విషయాలపై నోరు విప్పారు. వెంకయ్య మాటల్లోని బులెట్ పాయింట్స్ మీ కోసం.

  • మిత్రులంతా ఆత్మీయంగా కలవడం చాలా సంతోషం
  • జీవితంలో ఈ స్థాయికి రావడానికి అమ్మ , RSS, ABVP, బీజేపీ, ప్రజలు కారణం
  • ఎక్కడ వున్నా ప్రతి రోజు ఉదయం అందర్నీ కలిసేవాడిని ఇక ముందు అలా కలవడం కుదరదు అని గుర్తు చేసుకుంటే బాధగా వుంది
  • నేను బీజేపీ లో చేరినప్పుడు అదేమిపార్టీ అందులో ఎందుకు చేరుతున్నావ్ అని చాలా మంది మిత్రులు అనుమానం వ్యక్తం చేశారు
  • నేడు ప్రపంచం లో అతిపెద్ద పార్టీ బీజేపీ
  • ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నియమించిన వెంటనే పార్టీకి,పదవులకి రాజీనామా చేశా
  • రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి పదవులు నేను ఎప్పుడు కావాలనుకోలేదు అవి చిన్న పదవులు అని కాదు వాటి పై ఆశ లేదు
  • నా కుటుంబం లో ఎవరు కూడా రాజకీయ చరిత్ర వున్న నయకులు లేరు
  • నాకు సంవత్సరం వున్న సమయంలో అమ్మని కోల్పోయాను నన్ను ఇంతటి వాడిని చేసిన బీజేపీ నాకు అమ్మ తో సమానం
  • మంత్రి పదవి వధలడానికి బాధ పడుతున్నాడని కొన్ని వార్తలు రావడం బాధ కలిగించింది
  • వాజీపేయి ప్రధాని గా ఉన్న సమయంలో నేను కేంద్రమంత్రి గా ఉన్నపుడు మంత్రి పదవికి రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు నేడు అదే రీతిలో రాజీనామా చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్థి గా ఉండాల్సి వచ్చింది
  • పార్టీకి రాజీనామా చేసినప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు..నన్నుచూసి ప్రధానింమోది కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు
  • ప్రధాన మంత్రి ని మధ్యలో వదిలేసి వెళ్తున్నా అని బాధ నాకు లేదు
  • ప్రస్తుతం బీజేపీ లో వున్న సీనియర్ నేతల్లో వాజిపేయి, అధ్వాని తర్వాత నేనె సీనియర్ ని
  • 2019 లో రాజకీయాల నుండి తప్పుకుని స్వర్ణ భారతి ట్రస్ట్ ధ్వారా సమాజ సేవ చేయాలనుకున్నాను
  • రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతి పదవికి మీ పేరు సూచిస్తే వధులుకోవద్దు అని సుజనా చౌదరి మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు
  • 1984లో పార్టీలోకి రా..మంత్రి పదవి ఇస్తా అని రామారావు ఆహ్వానించారు నేను నమ్మిన సిద్ధాంతం కోసం సున్నితంగా తిరస్కరించా
  • నా అబ్బాయి చేసే వ్యాపారం గురించి నాకు పెద్దగా తెలియదు.. పట్టించుకోలేదు.. ఇటీవల కొందరు వ్యాపారం పై ఆరోపణలు చేసారు.. అప్పుడు ఎం జరిగిందో తెలుసుకున్న ప్రభుత్వం నుంచి నేరుగా కంపెనీ కి ఆర్డర్ ఇచ్చారు అని తేలింది…
  • సేవే మార్గంగా నడిచే స్వర్ణభారత్ ట్రస్ట్ మీద ఆరోపనులు చేసారు… విదేశాల నుంచి విరాళాలు తీసుకోము… ఈ విషయం తెలియక బుడద చల్లే కార్యక్రమం కొందరు చేసారు.. ఇలా చేయడం కొంత వరకు భాద కలిగించింది…
  • నా రాజకీయాల జోలికి నీవు రాకు..నీ వ్యాపారం జోలికి నేను రాను అని నా కుమారుడితో చెప్పాను
  • ఉప రాష్ట్ర పతిగా ఎన్నికయిన తరువాత మళ్ళి అందరిని కలుస్తా…
  • మీరు మరికొంత కాలం రాజకీయాల్లో వుంటే రాష్ట్రానికి కొంత న్యాయం జరిగేది అని చంద్రబాబు అన్నారు
  • రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక అంగీకారానికి కలిసి వచ్చి కేంద్రం దగ్గరకి వస్తే విభజన హామీలు అన్ని పరిష్కారం అవుతాయి
  • ప్రణబ్ ముఖర్జీ ని మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు మోడీ మంచి నిర్ణయం తీసుకున్నాడు మీరు ఉప రాష్ట్రపతి కావడం సంతోషం అన్నారు
  • సమయం దొరికితే నా అనుభవాల పై పుస్తకం రాసే ఆలోచన చేస్తాను

మరిన్ని వార్తలు

అద్వానీకి రాహుల్ సానుభూతి వచనాలు

ఆంధ్రజ్యోతి పై ఆర్కే పరువునష్టం దావా .

నంద్యాల ఎలక్షన్ షెడ్యూల్ ఇదే.