వెంకీ-వరుణ్ ‘ఎఫ్‌-2’ మూవీ ముహూర్తం ఫిక్స్…

Mahesh Babu Comment On Venkatesh F2 Movie Teaser

ఈ మధ్య టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌కు క్రేజ్ బాగా పెరిగింది… అప్పట్లో స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, మరియు శోభన్ బాబులు ఎలాంటి ఈగోలు లేకుండా, పాత్రలపై పట్టింపు లేకుండా వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలలో నటించి, మెప్పించారు. వాళ్ళ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు అడపాదడపా గెస్ట్ రోల్ లో నటించారు గాని పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ లో నటించలేదు.

కానీ వెంకటేష్-మహేష్ బాబు జనవరి 11, 2013 లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంతో వచ్చి, టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్‌ సినిమాలకు ఊపు తెచ్చారు. ఇప్పుడు అగ్ర కథానాయకులు అందరు మల్టీస్టారర్‌ లో నటించడానికి తెగ ఆరాటం పడుతున్నారు. ఇప్పుడు తాజాగా హ్యాట్రిక్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌-2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్‌-మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌లు ఎఫ్‌-2లో హీరోలుగా నటించనున్నారు. ఇప్పుడు ఈ చిత్రం జూన్‌ 23 న లాంఛ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహ్రీన్‌ నటించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ ని అందించనున్నాడు.