వెంకటేష్‌ తరువాత సినిమా కోసం యువ దర్శకులకి పరీక్షలు

వెంకటేష్‌ తరువాత సినిమా కోసం యువ దర్శకులకి పరీక్షలు

అరవైకి దగ్గర పడుతోన్న వెంకటేష్‌ ‘అసురన్‌’ రీమేక్‌ చేస్తున్నాడనే వార్త అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే ఆ చిత్రాన్ని తెలుగులో అంత గొప్పగా రీమేక్‌ చేసేదెవరనే ప్రశ్న దగ్గుబాటి క్యాంప్‌లోను కలకలం రేపింది. ఇరవై మంది యువ దర్శకులకి సినిమా ప్రదర్శించి ఎవరెవరు ముందుకి వస్తారనే పరీక్షలు కూడా జరిగినట్టు తెలిసింది. హను రాఘవపూడి, అజయ్‌ భూపతిలాంటి వారికి ఛాన్స్‌ వుందని వినిపించింది.

అయితే అనూహ్యంగా శ్రీకాంత్‌ అడ్డాల పేరు ఖరారయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం, ముకుంద, బ్రహ్మూెత్సవం చిత్రాలని రూపొందించిన ఈ దర్శకుడికి ఇలాంటి రా సినిమా ఇవ్వడమేంటనే చర్చ జరుగుతోంది. అయితే అతడిని వెంకటేష్‌ స్వయంగా ఎంచుకున్నాడట. సురేష్‌ బాబు షార్ట్‌ లిస్ట్‌ చేసి ఒక అరడజను పేర్లు ఇవ్వగా వారిలో వెంకీ ఇతడితో చేస్తానని చెప్పాడట.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసి వుండడం, ఆ దర్శకుడి శైలి తెలియడం వల్ల శ్రీకాంత్‌ అడ్డాల బెస్ట్‌ ఆప్షన్‌ అని వెంకీ భావిస్తున్నాడట. ఎలాగో ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ రీమేక్‌ చేస్తారు కనుక ఇక ఈ చిత్రానికి అంటూ దర్శకుడి మార్క్‌ ఏమీ వుండదు కనుక అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌ అడ్డాల బెస్ట్‌ అని డిసైడ్‌ అయ్యారట. అందులోను చాలా కాలంగా ఖాళీగా వున్నాడు కనుక ఇతడయితే చెప్పిన మాట వింటాడనేది దగ్గుబాటి బ్రదర్స్‌ నమ్మకమట.