మామ అల్లుళ్ల మల్టీస్టారర్‌కు ముహుర్తం ఫిక్స్‌…!

Finally Venky Mama To Start The Shoot

విక్టరీ వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్యలు కలిసి ఓ మల్టీస్టారర్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ మామ అల్లుడు కలిసి నటించబోతున్న చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ అయ్యింది. ఈ చిత్రం కోసం వెంకీ అభిమానులు, చైతూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వెంకీమామ’కు బాబీ దర్శకత్వం వహించనున్నాడు. వెంకీ, చైతూల క్రేజ్‌కు తగ్గట్టు బాబీ ఒక మంచి స్క్రిప్టును తయారు చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంను సెట్స్‌ మీదకు తీసుకెళ్లడానికి ముహుర్తం ఖరారు చేశారు.

venkymava

వెంకీ, చైతూల కాంభోతో రూపొందించబోతున్న ఈ మల్టీస్టారర్‌ను వచ్చే నెల రెండో వారంలో ప్రారంభించబోతున్నారు. అందుకు ఒక మంచి ముహుర్తాన్ని కూడా ఫిక్స్‌ చేశారు. కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. చైతూ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతూ, సమంతలు కలిసి నటిస్తున్నారు. భార్యాభర్తల బంధం గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే చైతూ ‘వెంకీమామ’లో పాల్గోననున్నాడు.

venky-and-nag