ఫస్ట్ లుక్ : సంక్రాంతి అల్లుళ్లు వస్తున్నారండోయ్…!

Venkatesh-Varun-Tej-Multist

ఎఫ్2( ఫన్ & ఫ్రూస్టేషన్ ) అంటూ మరోసారి ప్రేక్షకులను తన సరదా కామెడీ తో గిలిగింతలు పెట్టించడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి రెడీ అయ్యినట్టున్నారు. మెహ్రీన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈరోజే విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకీ-తమన్నా జోడి, వరుణ్ తేజ్-మెహ్రీన్ జోడి కనువిందుగా కనిపిస్తూ, సెలబ్రేషన్ మూడ్ ని పంచుతున్నారు. “వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్ళు” అంటూ ఈ సినిమాలో వెంకీ మరియు వరుణ్ తేజ్ అన్నదమ్ములుగా, తమన్నా మరియు మెహ్రీన్ అక్కచెల్లెలు గా నటిస్తున్న విషయాన్నీ చెప్పకనే చెప్పారు.

F2 First look in varun and venkatesh

 

వెంకటేష్ క్లీన్-షేవ్ లుక్ లో ఇదివరటికి పోలిస్తే చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్ మనకి అలవాటైన ఫిదా లుక్ లోనే మళ్ళీ కనిపించాడు. తమన్నా లుక్ లో ఏమాత్రం మార్పు కనిపించకపోగా, మెహ్రీన్ మాత్రం రాజా ది గ్రేట్ తో పోలిస్తే చాలా సన్నపడినట్టు కనిపిస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాలో లుక్ పరంగా మెహ్రీన్ చాల విమర్శలు ఎదుర్కున్న విషయం మనకు తెలిసిందే.

f2-movie--venkatesh

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అనిల్ రావిపూడి-దిల్ రాజు కాంబినేషన్ లో ఇది మూడో సినిమా (సుప్రీమ్, రాజా ది గ్రేట్ తరువాత). షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతుంది. .