పిక్‌: తళుకుతళుకు మంటున్న డాన్‌బాస్కో

raviteja

మాస్‌ మహారాజ్‌ రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మాస్‌ చిత్రాలకు కాలం చెల్లిన నేపథ్యంలో ఇటీవల రవితేజకు అన్ని ఫ్లాపులే ఎదురవుతున్నాయి. దాంతో ఈ చిత్రం హిట్‌ అవాలని చాలా గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది.

Goa Beauty Ileanas Birthday Wishes Poster From Team Amar Akbar Anthony

ఈ చిత్రాన్ని నవంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు షురూ చేశారు. ఈ చిత్రంలో కూడా మాస్‌ యాంగిల్స్‌ ఉండబోతున్నట్టు తాజాగా రిలీజైన పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటికే మొదటి సాంగ్‌ విడుదల చేసిన యూనిట్‌ తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. నవంబర్‌ 6న రెండో లిరకల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ పాటకు డాన్‌బాస్కో అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

image.png

రెండో లిరకల్‌ సాంగ్‌ డాన్‌బాస్కో రిలీజ్‌ డేట్‌తో పాటు ఒక స్టిల్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించింది. కాగా తాజాగా ఇల్లీబేబి, మాస్‌మహారాజ్‌ రవితేజ రొమాంటిక్‌ పిక్‌ ఒకటి విడుదల చేశారు. ఈ ఫొటోలో ఇద్దరు తళుకు తళుకు మంటున్న డ్రస్‌లతో రొమాంటిక్‌ చూపులతో ఆకట్టుకుంటున్నారు. ‘కిక్‌’ చిత్రంలో జంటగా నటించిన మంచి హిట్‌ను సొంతం చేసుకున్న రవితేజ, ఇల్లీ బేబీలకు ఈ చిత్రం కూడా హిట్‌ను ఇస్తుందా చూడాలి. ఈ చిత్రం హిట్‌ రవితేజ, ఇలియానా లకు చాలా అవసరం. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సక్సెస్‌ అయితే ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇద్దరి పరిస్థితి కూడా కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Amar-Akbar-Anthony-Teaser