మహాకూటమి తెచ్చేది చీకటి రోజులే – తెరాస మాజీ నేత వ్యాఖ్యలు

Mahakutami Will Bring Black Days To Telangana

తెరాస పార్టీకి చెందిన కరీంగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ నిన్న పద్మనాయక కమ్యూనిటీ హాల్ లో జరిగిన గౌడ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మహాకూటమి పైన తీవ్ర విమర్శలు చేశారు. అది మహాకూటమి కాదని, తెలంగాణ కు మళ్ళీ చీకటి రోజులను తేవడానికి దాపురించిన చీకటి కూటమి అని విరుచుకుపడ్డారు. రాబోతున్న ఎన్నికలు అనేవి తెలంగాణ రక్షకులకు, ఆంధ్ర లీడర్లకు మధ్య జరుగుతున్న సమరం గా ఉదహరించి, ఎలాగైనా మహాకూటమి ని ఓడించి, ఆంధ్ర లీడర్లకు తగిన గుణపాఠం నేర్పాలని సూచించారు.

gangula kamalakar

తెలంగాణ ప్రజలు ఆంధ్ర లీడర్లతో పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ని కూడా సాగనంపి, తెలంగాణ ని సాధించుకున్నారని, మహాకూటమి ముసుగులో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణాలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పి కొట్టాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఆంధ్ర పాలకులు తెలంగాణ కి తీవ్ర అన్యాయం చేశారని, నీళ్ళని దోచుకుంది చాలక తెలంగాణ రైతులకు సరైన కరెంటు సప్లై ని కూడా ఇవ్వకుండా వారి అప్పులకు, ఆత్మహత్యలకు కారణం అయ్యారని చెబుతూ, తెరాస ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు సప్లై తో పాటు, రైతు బంధు పథకం క్రింద ప్రతి రైతుకు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ప్రతి సవంత్సరం అందిస్తున్నారని గుర్తుచేశారు.

TRS KCR

గడిచిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం కెసిఆర్ 4 ఏళ్లలోనే చేసి చూపించారని, ఇవన్నీ గమనించి రాబోవు ఎన్నికల్లో తెరాస కు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించి, మహాకూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని యువకులు అందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని, తెరాస పార్టీ ని మరోమారు గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపించి, యువకులు వృద్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు.