ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి ఫస్ట్ లుక్…!

Savitri First Look At NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. తెలుగు తెర కథానాయకుడు, రాజకీయ మహా నాయకుడు అయిన నందమూరి తారక రామారావు పాత్రలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.

NTR BIOPIC

తొలుత ఈ సినిమాకి దర్శకుడు వైదొలగడం చేత అడ్డంకులు ఏర్పడగా, డైరెక్టర్ క్రిష్ ఈ బయోపిక్ యొక్క దర్శకత్వ బాధ్యతలు చేప్పట్టిన తరువాత సినిమాపై అంచనాలు తారాస్థాయి ని చేరుకున్నాయి. ఈ సినిమా ప్రచారానికి అనుసరిస్తున్న విధానం మహానటి సినిమాకి జరిగిన ప్రచార వ్యూహాలని గుర్తుచేస్తుండడం గమనించవలసిన విషయం. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావు గా సుమంత్, హరికృష్ణ గా కళ్యాణ్ రామ్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లని విడుదల చేసి, ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.

image.png

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుండి సావిత్రి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే, నిత్య మీనన్ సావిత్రి పాత్రల్లో కనిపిస్తున్న విధం, గుండమ్మ కథ సినిమాలోని “లేచింది నిద్ర లేచింది మహిళ లోకం” పాటలోని సన్నివేశాన్ని గుర్తుకు చేస్తుంది. ఈ పాట ని మరల ఈ బయోపిక్ లో వాడుకున్నారని ఈ పోస్టర్ ని చూస్తే ఇట్టే తెలుస్తుంది. ఏదేమైనా, నిత్య మీనన్ గుండమ్మ కథ సినిమాలో కాస్త లావుగా కనిపించే సావిత్రి ని తన లుక్స్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసిందని చెప్పొచ్చు.

ntr-bio