ఇద్దరు వెంకీలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

Venky Kudumula And Venky Atluri Talk Of The Industry
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ సంవత్సరం టాప్‌ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కాని ఇద్దరు కొత్త దర్శకులు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరి పేర్లు కూడా వెంకీ అవ్వడం కాకతాళియం. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ కుడుములతో వరుసగా చిత్రాలు చేసేందుకు యంగ్‌ హీరోు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వెంకీ కుడుములకు ఒక నిర్మాత అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఈయనకు మంచి పేరు వస్తుందని సినీ వర్గాల వారు నమ్ముతున్నారు. ఇక మరో వెంకీ ‘తొలిప్రేమ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నాలతో ఒక అద్బుతమైన ప్రేమకథను తెరకెక్కించిన వెంకీ అట్లూరి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఈయన ‘తొలిప్రేమ’ టైటిల్‌కు న్యాయం చేయగలడా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ దర్శకుడు వెంకీ అట్లూరి సూపర్‌ హిట్‌ను దక్కించుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఈయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు పలువురు యువ హీరోలు ఆసక్తిగా ఉన్నారు. ఈయన తర్వాత సినిమా దిల్‌రాజు బ్యానర్‌లో ఉండబోతుంది అంటే ఈయన ఏ స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్నాడో చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు వెంకీలు కూడా భవిష్యత్తులు స్టార్‌ దర్శకులుగా పేరు తెచ్చుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.