“వెంకీ” మూవీ రీరిలీజ్‌కి బ్రహ్మాండమైన స్పందన!

“వెంకీ” మూవీ రీరిలీజ్‌కి బ్రహ్మాండమైన స్పందన!
Cinema News

టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అలా గత ఏడాది సహా ఈ ఏడాదిలో కూడా పలు మూవీ లు రీ రిలీజ్ కి వచ్చి హిట్స్ అయ్యాయి. ఇక మళ్ళీ ఈ ఏడాదికి ఎండింగ్ గా వచ్చిన మరో క్రేజీ అండ్ అవైటెడ్ రీ రిలీజ్ కి వచ్చిన మూవీ “వెంకీ”. మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఒక వింటేజ్ క్లాసిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కూడా ఆడియెన్స్ లో ఒక స్పెషల్ ప్లేస్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ ఇయర్ కి ఎండింగ్ బ్లాస్ట్ గా థియేటర్స్ లో వచ్చిన ఈ మూవీ ఆల్ మోస్ట్ అన్ని చోట్లా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. మెయిన్ గా ఆ కామెడీ సీన్స్ కి కానీ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎంట్రీ లకి గాని థియేటర్స్ లో రెస్పాన్స్ దద్దరిల్లుతుంది. దీనితో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక రీ రిలీజ్ కి సెలబ్రేషన్స్ లాంటివి థియేటర్స్ లో కనిపిస్తుండడంతో ఈ సినిమా తాలూకా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.