బ్రహ్మీనే మించేసిన కొత్త కమెడియన్‌

Vennela Kishore Overtak Brahmanandam

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Vennela Kishore Overtake Brahmanandam

టాలీవుడ్‌లో మొన్నటి వరకు బ్రహ్మానందం లేని సినిమాను ఊహించుకోవడం కష్టంగా అనిపించేది. స్టార్‌ హీరోల సినిమాలు అయినా కూడా బ్రహ్మానందం ఉంటేనే ఆ సినిమా స్థాయి పెరిగేది. ఏదో ఒక్కటి అర సినిమాల్లో మినహా దాదాపు అన్ని బడా చిత్రాల్లో కూడా బ్రహ్మానందం కనపించే వాడు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం బ్రహ్మానందం ఒక్కరోజు రెమ్యూనరేషన్‌ లక్ష నుండి లక్షన్నర వరకు ఉండేది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్రహ్మానందం పారితోషికం వసూళ్లు చేసేవాడు. అంతటి స్థాయిని మెయింటెన్‌ చేసిన బ్రహ్మానందం ఇప్పుడు అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వెన్నెల కిషోర్‌ హవా నడుస్తుంది.

ఈ కమెడియన్‌ చేసిన సినిమాలు సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా కూడా అతడి క్రేజ్‌ సినిమా సినిమాకు పెరగడంతో పాటు ఆయన పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దాంతో సినిమా సినిమాకు కూడా వెన్నెల కిషోర్‌ రేటును పెంచుతూనే ఉన్నాడు. ప్రస్తుతం యమబిజీగా గడుపుతున్న వెన్నెల కిషోర్‌ రోజుకు రెండు నుండి రెండున్నర లక్షల పారితోషికంను అందుకుంటున్నాడు. ఈ స్థాయిలో ప్రస్తుతం తెలుగులో ఏ కమెడియన్‌ కూడా పారితోషికాన్ని పొందడం లేదు. తాజాగా ‘అమీతుమీ’ చిత్రంలో వెన్నెల కిషోర్‌ పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈయన పారితోషికం మరింత పెరుగుతుందేమో చూడాలి. ఈ కమెడియన్‌ టైం ఇంకా ఎంత కాలం నడుస్తుందో..!

మరిన్ని వార్తలు :

ఇంద్రగంటి యాక్సిడెంట్‌ ఒక పెద్ద..!

మళ్లీ ప్రేమ వివాహమే