‘ఎన్టీఆర్‌’లో విద్యాబాలన్‌.. అంత సీన్‌ లేదు

Vidya Balan Main Role In Balakirshna NTR Biopic Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నాడు. ఎన్టీఆర్‌గా బాలయ్య నటించబోతున్నాడు. దాదాపు 70 గెటప్స్‌లో బాలయ్య కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇక ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. తెలుగులో పలువురు హీరోయిన్స్‌ను ఈ పాత్రకు సంప్రదించారు. ఆ మద్య నిత్యామీనన్‌ తనను ఆ పాత్రకు సంప్రదించారు అని, కాని తాను ఆ పాత్రకు నో చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా విద్యాబాలన్‌ను ఆ పాత్రకు సంప్రదిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన విద్యాబాలన్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బసవతారకం పాత్రలో నటిస్తుందంటే ఒక్క శాతం కూడా నమ్మశక్యంగా లేదని, ఖచ్చితంగా ఆ పాత్రను ఆమె చేయదు అంటూ కొందరు భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలో బసవతారకం గారికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మెయిన్‌ ఫోకస్‌ ఎన్టీఆర్‌ పాత్రపైనే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అందుకే బసవతారకం పాత్ర జస్ట్‌ ఉంది అన్నట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ పెట్టి ఆమెను ఆ పాత్రకు తీసుకోరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని సినిమా క్రేజ్‌ను పెంచేందుకు బాలయ్య ఆమెను సంప్రదించాలని నిర్మాతలకు సూచించాడు అంటూ కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో తేలిపోయే అవకాశం ఉంది.