ప్రత్యేక హోదా : సెల్ టవరెక్కిన ఉద్యోగి…ఉద్రిక్తత…!

Vijay bhasker Demands AP Special Status On Cell Tower

ప్రత్యేక హోదా కోసం ఏపీలో నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిరసనలు ఇప్పుడు ఆత్మాహుతి దాకా వెళ్ళడం కలకలం రేపుతున్నాయి. ఇటీవల ప్రత్యేక హోదా కోరుతూ ఒక యువకుడు తనువూ చాలించిన ఘటన మరువక ముందే ఈ రోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో పెనుబోలు విజయభాస్కర్ అనే ఓ మున్సిపల్ ఉద్యోగి సెల్ టవర్ ఎక్కాడు.

Vijay bhasker Demands AP Special Status On Cell Tower

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేకపోతే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నినాదాలు చేస్తున్నాడు. రెండు మూడు సార్లు కిందకి దూకే ప్రయత్నం కూడా చేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని విజయ్‌ హెచ్చరిస్తున్నాడు.