నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మ‌ధుర‌వాణిగారూ…

Vijay Devarakonda First look release in Mahanati movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మ‌హాన‌టిలో ఒక్కొక్క‌రి క్యారెక్ట‌ర్ కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌చేస్తోంది చిత్ర యూనిట్. ఇటీవ‌ల ఈ సినిమాలో సమంత లుక్ విడుద‌ల‌చేసిన మ‌హాన‌టి బృందం ఇప్పుడు… విజ‌య్ దేవ‌ర‌కొండ స్టిల్ రిలీజ్ చేసింది. స‌మంత జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణి పాత్ర‌లో న‌టించ‌గా… ఆమె స్టిల్ పై నా పేరు క‌న్యాశుల్కంలో సావిత్రి గారి పేరే… మ‌ధుర‌వాణి అన్న క్యాప్ష‌న్ రాసి ఉంది. విజయ్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ఆయ‌న జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణితో మాట్లాడుతున్న‌ట్టుగా క్యాప్ష‌న్ ఉంది. స్టిల్ లో విజ‌య్ ఆ కాలం నాటి స్కూట‌ర్ పై… అప్ప‌టి కెమెరా మెడ‌లో త‌గిలించుకుని, హెల్మెట్ పెట్టుకుని నవ్వుతూ చూస్తున్నాడు. నిజం ఎప్ప‌డూ అందంగానే ఉంటుంది మ‌ధుర‌వాణి గారు… విజ‌య్ ఆంటోనీ అని రాసి ఉంది.

దీన్ని బ‌ట్టి చూస్తే విజ‌య్ ఫొటోగ్రాఫ‌ర్ గా న‌టించిన‌ట్టు అర్ద‌మ‌వుతోంది. ఈ పోస్ట‌ర్ ను విజ‌య్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. 80ల‌కాలం నాటి అందం… అత‌డి పేరు విజ‌య్ ఆంటోని… మ‌హాన‌టి క‌థ చెప్పే సినిమాలో న‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నా అని ట్వీట్ చేశారు. మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మ‌హాన‌టి… షూటింగ్ పూర్తిచేసుకుని మే 9న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌యింది. సావిత్రిగా కీర్తి సురేశ్, ఆమె భర్త జెమినీగ‌ణేశన్ గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ నిర్మించిన మ‌హాన‌టికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మోహ‌న్ బాబు, ప్ర‌కాశ్ రాజ్, షాలినీ పాండే, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.