గీతగోవిందంలో కూడా నోట్లో నోరు పెట్టిన విజయ్ దేవరకొండ ?

Vijay Devarakonda hot kiss In Geetha Govindam

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో సిగ్గు కాస్త పక్కకిపోయింది. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందులో హీరో క్యారక్టరైజేషన్ అంతకు మించి హిట్ అయ్యింది. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఆ బాధ నుంచి తప్పుకోడానికి కాస్త శృతి మించి వ్యవహరించడం, లవర్ తో కూడా ఘాటు రొమాన్స్ చేయడం , లిప్ టూ లిప్ కిస్ పెట్టడం లాంటివి కుర్రకారుని ఎర్రెక్కించేసాయి. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత లిప్ టూ లిప్ కిస్ ఫార్ములాకి మళ్లీ కొత్త ఊపు వచ్చింది. ఇక rx 100 కూడా కాస్త ఘాటు , హాట్ సీన్లతో పెద్ద హిట్ కొట్టేసరికి ఫిలిం మేకర్స్ దృష్టి అంతా అటు వైపు పడింది. అయితే ఈ క్రెడిట్ మాత్రం సీన్స్ సృష్టించిన నిర్మాతల కన్నా అందులో యాక్ట్ చేసిన విజయ దేవరకొండకే ఎక్కువగా దక్కుతోంది. rx 100 హీరో కార్తికేయ సైతం తనను జూనియర్ అర్జున్ రెడ్డి అని పిలుస్తున్నారు అని చెప్పడం అందుకు పెద్ద ఉదాహరణ.

Vijay Devarakonda And Rashmika
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే త్వరలో రిలీజ్ కాబోతున్న గీతగోవిందం సినిమా గురించి. ఆ సినిమా ట్రైలర్ చూస్తుంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా స్మూత్ గా వుంది. దీంతో అర్జున్ రెడ్డి తరహా సీన్స్ ఇందులో ఉండవేమో అని విజయ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. కానీ చిత్ర యూనిట్ లో కొందరు అంతరంగికంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన వివరాల ప్రకారం గీతగోవిందంలో కూడా విజయ్ దేవరకొండ హీరోయిన్ కి మంచి లిప్ టూ లిప్ కిస్ ఇచ్చే సీన్ ఉందని తెలుస్తోంది. అయితే ఆ సీన్ అర్జున్ రెడ్డి కన్నా బాగా భిన్నంగా వుంటుందట. మొత్తానికి అర్జున్ రెడ్డి తో వచ్చిన క్రేజ్ ని విజయ్ ఏదోవిధంగా కాపాడుకుంటూ వస్తున్నాడన్నమాట.