విజయ్ దేవరకొండ రేంజ్ మారింది

విజయ్ దేవరకొండ రేంజ్ మారింది

కేవలం మూడు సినిమాలతో టాప్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. విజయ్ తో నటించేందుకు బాలీవుడ్ భామలు సైతం పోటీ పడుతున్నారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ స్టార్స్ తో క‌లిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోలో దీపికా ప‌దుకొణే, అలియా భ‌ట్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆయుష్మాన్ ఖురానా, విజ‌య్ సేతుప‌తి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పార్వ‌తి తిరువొత్తు, మ‌నోజ్ బాజ్‌పేయ్ ఉన్నారు.

నార్త్‌, సౌత్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఒకే ఫ్రేమ‌లో క‌నిపించే స‌రికి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మరి వీరంద‌రు క‌ల‌వ‌డానికి కార‌ణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ మూవీ ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తి కాగానే పూరి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు.