‘నోటా’ చుట్టు ముసురుతున్న వివాదం

Vijay Devarakonda NOTA lands in Legal Trouble

విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్వి భాషా చిత్రం ‘నోటా’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను దసరా కానుకగా వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ఖరారు కాని ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని పక్కా పొలిటికల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్న నేపథ్యంలో  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రంపై రచయిత శశాంక్‌ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Nota Movie

‘నోటా’ చిత్రానికి శశాంక్‌ మాటలు రాయడం జరిగిందట. తెలుగు వర్షన్‌ డైలాగ్స్‌ మొత్తం తానే రాశానని, కాని టైటిల్‌ కార్డ్స్‌లో తన పేరు వేయక పోవడంతో పాటు, తనకు ఇవ్వాల్సిన పారితోషికం కూడా ఇవ్వలేదని, తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చే వరకు సినిమా అడ్డుకోవాలని కేసులో పేర్కొనడం జరిగింది. గత కొంత కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై విడుదలకు ముందు ఇలాంటి వివాదం ముసరడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శశాంక్‌ రాసిన డైలాగ్స్‌ను ట్రైలర్‌లో వాడినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. మరి ఎందుకు శశాంక్‌కు క్రెడిట్‌ ఇవ్వడం లేదో చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పాల్సి ఉంది.