‘ఈ నగరానికి ఏమైంది’ అంటున్న అర్జున్‌ రెడ్డి?

Vijay Devarakonda plays Guest role in Ee Nagaraniki emaindi movie

‘పెళ్లి చూపులు’ చిత్రం తర్వాత దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేయలేదు. తాజాగా సినిమా విడుదల అవుతున్న సమయంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేందుకు ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ఉన్నాడు అంటూ వెళ్లడి చేసినట్లుగా తెలుస్తోంది.

తరుణ్‌ భాస్కర్‌తో విజయ్‌ దేవరకొండకు మంచి సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యం కారణంగానే ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తరుణ్‌ భాస్కర్‌ చిత్రం ‘పెళ్లి చూపులు’ వల్లే విజయ్‌ దేవరకొండకు మంచి అవకాశాలు దక్కాయి. ఆ సినిమా తర్వాతే అర్జున్‌ రెడ్డి చిత్రంలో నటించాడు. అర్జున్‌ రెడ్డితో ఒక్కసారిగా స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘ఈనగరానికి ఏమైంది’ అంటూ గెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్‌ దేవరకొండ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఖచ్చితంగా సినిమాకు హైలైట్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ ఎత్తున జూన్‌ 29న విడుదల చేయబోతున్నారు.