అర్జున్‌ రెడ్డి అవికూడా మొదలెట్టాడుగా..!

Vijay Devarakonda to do advertisement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’లో ఒక చిన్న పాత్రను పోషించిన విజయ్‌ దేవరకొండ ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. విజయ్‌ దేవరకొండకు మంచి ప్రతిభ ఉందని అంతా గుర్తించారు. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక్కసారిగా విజయ్‌ దేవరకొండ స్టార్‌ అయ్యాడు. ఆ సినిమా విజయ్‌ దేవరకొండకు హీరోగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక తాజాగా విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను ఒక్కసారిగా విజయ్‌ ఫేట్‌ను మార్చేసింది. ప్రస్తుతం ఈయన ముందు కోట్లు పట్టుకుని నిర్మాతలు నిల్చుంటున్నారు.

విజయ్‌ దేవరకొండ సినిమాలతో పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక స్థాయి గుర్తింపు వచ్చిన తర్వాతే స్టార్‌ హీరోలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసే అవకాశం దక్కుతుంది. ఆస్థాయి అప్పుడే విజయ్‌ దేవరకొండకు వచ్చిందని పలు కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఆయనతో తమ బ్రాండ్స్‌కు ప్రచారం చేయించుకునేందుకు క్యూలు కడుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ సంస్థ రెండున్నర కోట్లు ఇచ్చి ఆరు నెలలకు గాను విజయ్‌ దేవరకొండతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విజయ్‌ ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. ముందు ముందు మరెంతగా విజయ్‌ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడో చూడాలి.