ట్యాక్సీవాలా ఇంకాస్త ఆలస్యం.. అసలు వచ్చేదెప్పుడు?

Vijay Devarakonda Taxiwala Movie Postponed

విజయ్‌దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం చేసిన తర్వాత మొదలు పెట్టిన చిత్రం ‘ట్యాక్సీవాలా’. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. విజయ్‌ ఈ చిత్రంలో విభిన్నంగా ఉంటాడు అంటూ ఫస్ట్‌లుక్‌తో పాటు పలు ప్రమోషన్‌ వీడియోలు కూడా విడుదల అయ్యాయి. కాని సినిమా విడుదల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. గీత గోవిందం చిత్రం కంటే ముందే ట్యాక్సీవాలా విడుదల అవ్వాల్సి ఉంది. కాని ట్యాక్సీవాలా కంటే గీత గోవిందంపై ఎక్కువ నమ్మకం ఉంది. కనుక గీత గోవిందం చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అనుకున్నట్లుగానే గీత గోవిందం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఊహించని రీతిలో వసూళ్లను సాధిస్తుంది. ఇలాంటి సమయంలో ట్యాక్సీవాలా తీసుకు రావడం వల్ల విజయ్‌ క్రేజ్‌ దెబ్బ తింటుందని కొందరు సలహా ఇస్తున్నారు.

geetha govindam And Nota Movie

విజయ్‌ దేవరకొండకు ‘ట్యాక్సీవాలా’ చిత్రంపై నమ్మకం లేదు. అందుకే ఆ చిత్రాన్ని విడుదల కాకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ చిత్ర నిర్మాతలతో మాట్లాడి విడుదలను వాయిదాల మీద వాయిదాలు వేయిస్తున్నాడు. ట్యాక్సీవాలా నిర్మాతలకు మరో సినిమాను చేసి పెడతాను అంటూ విజయ్‌ దేవరకొండ హామీ ఇచ్చాడు. అందుకే ట్యాక్సీవాలా విడుదల విషయంలో నిర్మాతలు పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ ‘నోటా’ చిత్రంతో రాబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటా చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే నోటాను విడుదల చేయాలని భావిస్తున్నారు. నోటా తర్వాత అయినా ట్యాక్సీవాలా విడుదల అవుతుందా లేదో తెలియడం లేదు. నోటా విడుదల అవ్వగానే ‘డియర్‌ కామ్రేడ్‌’ వస్తుందేమో చూడాలి. అసలు ట్యాక్సీవాలా వచ్చేది ఎన్నడో క్లారిటీ రావడం లేదు.

Taxiwala Movie release date