అర్జున్‌ రెడ్డి తమ్ముడు, యాంగ్రీ యంగ్‌మన్‌ కూతురు జంటగా…!

Vijay Devarakonda Younger Brother Anand Devarakonda Is The Hero Entry

సినిమా పరిశ్రమలో వారసులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్స్‌లో ఎక్కువగా వారసులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జాబితాలోనే మరో ఇద్దరు చేరబోతున్నారు. భారీ ఎత్తున క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంఅయ్యాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆనంద్‌కు జోడీగా నటించబోతున్న హీరోయిన్‌ కూడా వారసురాలే అంటూ ప్రచారం జరుగుతుంది.

anandh-devarakonda

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆనంద్‌ దేవరకొండ మరియు రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక జంటగా ఒక చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ మహేంద్ర ఎన్నో షార్ట్‌ ఫిల్మ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. మంచి స్క్రిప్ట్‌తో పాటు ఒక మంచి కథను ఈయన రాసుకోవడంతో రాజశేఖర్‌ మరియు విజయ్‌ దేవరకొండలు ఆ కథను నచ్చారు. త్వరలోనే ఈ చిత్రంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ ఇటీవలే తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరో వైపు అర్జున్‌ రెడ్డి తో స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తమ్ముడు అంటూ ఆనంద్‌కు మంచి క్రేజ్‌ దక్కింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి నటించబోతున్న చిత్రాలు భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం.

vijay-anandh