యంగ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ యొక్కవ్ నెక్స్ట్ మూవీ…!

Vijay Deverakonda's next movie with young director...!
Vijay Deverakonda's next movie with young director...!

యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ పెట్లతో ఫ్యామిలీ స్టార్ సినిమా తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. వీటిలో ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 న రిలీజ్ కానుండగా గౌతమ్ తీస్తున్న సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. విషయం ఏమిటంటే, ఈ రెండిటి అనంతరం ఇటీవల రాజా వారు రాణి గారు సినిమా తో మంచి విజయం అందుకున్న రవికిరణ్ కోలా తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా చేయనునట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోందట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగె పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా సాగనుండగా, గౌతమ్ తిన్ననూరితో విజయ్ తన మూవీ ను ముగించిన వెంటనే ఇది సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నది .