ఎన్టీఆర్‌ మూవీలో రాములమ్మ..!?

vijayashanthi play indira gandhi role in NTr biopic Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లేడీ అమితాచ్చన్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి అయిదు సంవత్సరాలుగా అది కూడా లేకుండా పోయింది. ఈ సమయంలోనే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అదుగో, ఇదుగో ఆ సినిమాలో, ఈ సినిమాలో ఆమె నటించబోతుంది అంటూ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. తాజాగా మరోసారి విజయశాంతికి సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ చేయబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్ర కూడా ఉంటుందని, పది నుండి పది హేను నిమిషాల పాటు ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఇందిరా గాంధీ పాత్రను విజయశాంతితో చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ పాత్రను విజయశాంతి వేయడం వల్ల సినిమా స్థాయి పెరగడంతో పాటు, మంచి ఓపెనింగ్స్‌ మరియు క్రేజ్‌ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. మరి విజయశాంతి అందుకు ఒప్పుకుంటుందా అనేది చూడాలి.