విక్ర‌మ్ వేద రీమేక్ మీద అఫీషియల్ ప్రకటన !

2017 జులైలో విడుదలైన త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం విక్ర‌మ్ వేద తెలుగులో రీమేక్ కానున్న‌ట్టు రెండ్రోజుల నుండి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళ వ‌ర్షెన్‌లో న‌టించిన మాధవన్, విజయ్ సేతుపతి పాత్ర‌ల‌లో బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ న‌టించ‌నున్న‌ట్టు ఈ మధ్య ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్తలపై విక్రమ్‌ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్‌ తాజాగా క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్‌ విక్రమ్‌ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని విక్ర‌మ్ వేద రీమేక్ హ‌క్కుల‌ని ఎవ్వ‌ర‌కి ఇవ్వ‌లేదని, మేం చెప్పే వ‌ర‌కు తప్పుడు వార్త‌ల‌ని ఎవ్వ‌రు న‌మ్మోద్దని వారు ప్రకటించారు. అలానే తప్పుడు సమాచారాన్ని పట్టించుకోకూడదని మీడియాను మేం కోరుతున్నాం. ధన్యవాదాలు’ అని నిర్మాణ ప్రకటన విడుదల చేసింది. పుష్క‌ర్ గాయ‌త్రి తెర‌కెక్కించిన విక్ర‌మ్ వేద‌ చిత్రంలో మాధ‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి ప్రతినాయకుడిగా నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 2017 జులైలో విడుదలైన ఈ చిత్రం రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కాగా, రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది.