విశాఖపట్టణం అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్

విశాఖపట్టణం అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల ఆందోళనకు సంఘీభావంగా తుళ్ళూరులో పర్యటించి వారికీ సంఘీభావం తెలిపారు. విశాఖకు తెలుగు దేశం పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. అయితే అమరావతికి వైసీపీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించేలా ఉన్నాయని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చినపుడు రాజధానిని ఎన్నుకొనే అవకాశం అయన చేతిలోనే ఉందని చెప్పాలి. విశాఖపట్టణం కాదని ఆనాడే అమరావతిని రాజధానిగా నిర్ణయించడం జరిగింది. అయితే ఇపుడు అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో విశాఖపట్టణాన్ని అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఇపుడు విశాఖ కి వ్యతిరేకం కాదు అంటూనే చంద్రబాబు అమరావతికి మద్దతు తెలపడం పట్ల రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ఒక పక్క విద్యార్థులు, నేతలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.