హీరో విశాల్ కి గాయాలు !

Vishal Injured On The Sets Of Temper Remake

తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలియనిది కాదు అందుకే ఆ సినిమాని తమిళంలో అయోగ్య’గా విశాల్ రీమేక్ చేస్తున్నాడు. సినిమాలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో విశాల్ గాయపడ్డాడు. ఒక కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడని సమాచారం. ఈ రీమేక్ కోసం అల్లు అర్జున్ ‘సరైనోడు’లో ఉన్న ‘బ్లాక్ బస్టర్’ ఐటెం సాంగ్ ని వాడుకుంటున్నారు. ఈ సినిమాలు రెండిటినీ దేవిశ్రీ ప్రసాదే పాటలు కంపోజ్ చేశారు. అయితే పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ని అంత ఈజీగా మర్చిపోలేం. మంచి డ్యాన్స్ కి స్కోప్ ఉన సాంగ్ కావడంతో విశాల్ కూడా గట్టిగానే ట్రై చేశాడట కానీ ఒక మూమెంట్ దగ్గర మాత్రం ఆయన పట్టు తప్పి పడడంతో ఆయనకు గాయం అయ్యిందట. ఈ సాంగ్లో విశాల్ సరసన శ్రద్దా దాస్ నటిస్తోంది. మోచేయి వాయడంతో పాటు కాలికి కూడా గాయమయిందట. దీంతో ఈ పాట చిత్రీకరణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. విశాల్ కోలుకున్న తరువాత సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని అంటున్నారు.