తెలుగులో పందెంకోడి 2 పరిస్థితి…!

Vishal Pandem Kodi 2 Movie Public Response

విశాల్‌ నటించిన ‘పందెంకోడి 2’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విశాల్‌ నటించిన ‘పందెంకోడి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని ఆరుకోట్లకు కొనుగోలు చేశాడు. ‘అరవింద సమేత’, ‘హలోగురు ప్రేమకోసమే’ చిత్రాలు ఉండగా కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ‘పందెంకోడి 2’ చిత్రం పెట్టిన మొత్తంతో పాటు లాభాలను కూడా సులభంగా రాబడుతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంచనాలు వేస్తున్నారు.

Vishal Pandem Kodi 2 Movie Heroine Keerthi Suresh

ఎన్టీఆర్‌తో బరిలోకి దిగిన కూడా విశాల్‌ కు మంచి స్పందన దక్కింది. తెలుగులో ఈ చిత్రం సక్సెస్‌ అయినట్టే అనే సినీ వర్గాల వారంటున్నారు. ఈ మధ్య కాలంలో విశాల్‌ తెలుగులో చెప్పుకొదగ్గ విజయాలేవి సొంతం చేసుకోలేదు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటించింది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇష్టపడుతున్నారు అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్ర యూనిట్‌ సభ్యులుగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

pandham-kodi-vishal-movies