శ్రీరెడ్డి వద్దకు వెళ్తే కెమెరా పట్టుకెళ్లండి : విశాల్‌…!

Vishal Shocking Comments On Sri Reddy

వివాదాస్పద తార శ్రీరెడ్డిపై విశాల్‌ చేసిన తాజా కామెంట్స్‌ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. డైరెక్ట్‌గా ఆమెను విమర్శించినట్లుగా కాకుండా ఆమెకు చురకలు అంటించాడు. ప్రస్తుతం విశాల్‌ ‘పందెంకోడి 2’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విశాల్‌ హడావుడిగా ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాతల మండలి మరియు నడిగర్‌ సంఘంలో కీలక వ్యక్తి అయిన కారణంగా విశాల్‌ ఏ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నా కూడా వాటి గురించి అడుగుతూనే ఉంటారు. తాజాగా నగడిర్‌లోకి శ్రీరెడ్డి రావడంపై విశాల్‌ స్పందించాల్సిందిగా మీడియా వారు కోరడం జరిగింది.

 

sree-reddy

అందుకు విశాల్‌ స్పందిస్తూ.. శ్రీరెడ్డి తమిళ సినిమా ఇండస్ట్రీకి రావడం ఆనందం. ఆమెకు తమిళంలో మంచి ఆఫర్లు వచ్చి స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపై అయినా వివాదాలకు దూరంగా ఉంటూ శ్రీరెడ్డి మంచి కెరీర్‌ను కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను అంటూ విశాల్‌ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఎవరైనా శ్రీరెడ్డి వద్దకు వెళ్లాలని భావిస్తే వారితో కెమెరా తీసుకు వెళ్లడం ఉత్తమం. అది శ్రీరెడ్డికి కూడా చాలా మంచిది అంటూ కామెంట్‌ చేశాడు. కెమెరా తీసుకు వెళ్లడం వల్ల శ్రీరెడ్డి నుండి రక్షణ పొందవచ్చు అనేది విశాల్‌ అర్థం అయ్యి ఉంటుంది. విశాల్‌ చేసిన వ్యాఖ్యలతో పక్కనే ఉన్న కీర్తి సురేష్‌తో పాటు ఇతరులు కూడా గట్టిగా నవ్వేశారు. విశాల్‌కు శ్రీరెడ్డి మళ్లీ ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వనుందో చూడాలి.

vishal-speech