ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్..ఇంటి ముందు యువతి రచ్చ !

The volunteer cheated in the name of love.
The volunteer cheated in the name of love.

ఏపీలో గ్రామ వాలంటీర్ల దారుణాలు ఒక్కక్కొటి బయటపడుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ వ్యవహారం బయటకు వచ్చింది. మొన్న విశాఖలో ఓ మహిళపై వాలంటీర్‌ దాడి చేసిన సంఘటన మరువక ముందే… ప్రేమ పేరుతో మోసం చేసిన వాలంటీర్ సంఘటన బయటకు వచ్చింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… కాశినాయన మండలంలో మాచవరం చెన్నారెడ్డి, అమ్మాయి (22) వాలంటీర్లుగా పనిచేస్తూన్న సమయంలో వీళ్లిద్దరి సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. వేరే అబ్బాయితో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరగా, చెన్నారెడ్డి పెళ్లి సంబందాన్ని చెడగొట్టి అమ్మాయిని తీసుకుని సోమవారం బెంగుళూర్ వెళ్లాడు. బుధవారం తిరిగి అమ్మాయిని తీసుకొచ్చి గ్రామంలో వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి అమ్మాయిని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ అమ్మాయి చెన్నారెడ్డి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో, చెన్నారెడ్డి ఇంటిముందు బైఠాయించింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.