పెళ్లి చేసుకోలేదనే కోపంతో.. ప్రియుడి కొడుకుని చంపేసిన యువతీ..!

A young woman killed her boyfriend's son out of anger for not getting married..!
A young woman killed her boyfriend's son out of anger for not getting married..!

వివాహేతర సంబంధం ఓ బాలుడి ప్రాణాలు బలి తీసుకుంది. వివాహమైన వ్యక్తిని ప్రేమించిన ఓ యువతి.. తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో అతడి కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.

ఇంద్రపురి ప్రాంతానికి చెందిన నిందితురాలు పూజా కుమారికి 2019లో జితేందర్​ అనే వివాహితుడితో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని పూజను నమ్మించి ఆమెతో జితేందర్ సహజీవనం కొనసాగించాడు. 2022లో పూజను విడిచిపెట్టి.. తన భార్యాకుమారుల దగ్గరకు వెళ్లిపోవడంతో జితేంద్రపై పూజ కోపం పెంచుకుంది.

అదను చూసి అతడి కుమారుడు దివ్యాంశ్(11) నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి చొరబడి గొంతు నులిమి చంపేసింది.​ అనంతరం అక్కడే ఉన్న దుస్తుల్లో చుట్టి బెడ్‌బాక్స్‌లో పెట్టి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన జితేందర్‌ కుమారుడి మృతదేహం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాలతో జితేందర్‌ ప్రియురాలు పూజగా నిర్ధరించి అరెస్టు చేశారు.