ఉన్నది ఒక్కటే జిందగీ… తెలుగు బులెట్ రివ్యూ

Vunnadhi Okate Zindagi Movie review

నటీనటులు :   రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు 

నిర్మాతలు  : స్రవంతి  రవికిషోర్ , కృష్ణ   చైతన్య 
దర్శకత్వం :  కిషోర్  తిరుమల 

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి  శ్రీ  ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ :  సమీర్  రెడ్డి 

ఎడిటర్ : శ్రీకర్  ప్రసాద్ 

మనిషి జీవితంలో ఎక్కువ కన్ఫ్యూజన్ వుండే కాలం యవ్వనం. కొత్త ప్రపంచం రారా అని పిలుస్తుంది. అయితే ఎక్కడిదాకా వెళ్లాలో , ఎక్కడ ఆగాలో తెలిసే వయసు కాదు. అంత అనుభవం ఉండదు. ఆ కన్ఫ్యూజన్ లో కుర్రోళ్ళ మీద బలమైన ప్రభావం చూపేవి రెండు. ఒకటి ప్రేమ, ఇంకోటి స్నేహం. సహజంగా ఈ వ్యవహారాలూ యువతని ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెడతాయి. కానీ నేర్చుకుంటే జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిస్తాయి. కాస్త కటువుగా అయినా మన వ్యక్తికత్వ శిల్పాన్ని చెక్కుతాయి. మనిషి జీవితంలో అతి విలువైన, యవ్వనం నుంచి అసలు జీవితానికి వారధిగా నిలిచే సంధికాలాన్ని ఓ కుర్రోడి కథ ద్వారా చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ తో హిట్ కొట్టిన హీరో రామ్, దర్శకుడు తిరుమల కిషోర్ ఈసారి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. దీంతో ఉన్నది ఒకటే జిందగీ మీద ఎన్నో అంచనాలు. ఆ అంచనాల్ని సినిమా అందుకుందో లేదో చూద్దాం.

కథ…

అభిరాం ( రామ్ ) ఓ నిలకడ వున్న వ్యక్తి. జీవితం సుఖమే కాదు కష్టం ఇచ్చినా తీసుకోగలిగే ధైర్యం అతని సొంతం. అలాంటి స్థిరమైన వ్యక్తిత్వాన్ని అతనికి అలవరిచేలా చేసిన బాల్యం, యవ్వనం, చదువు తర్వాత జీవితాన్ని స్పృశించిందే ఉన్నది ఒకటే జిందగీ కథ. ప్రతి మనిషి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసే స్నేహం,ప్రేమ అభి జీవితంలో ఏమి చేశాయి. వాటిని అతను ఎలా డీల్ చేసాడు అన్నదే ఈ సినిమా.

విశ్లేషణ…

మన జీవితాన్ని ఎప్పుడైనా తరచితరచి వెనక్కి చూసుకుంటే మొత్తం లైఫ్ ఒక విధమైన స్పీడ్ లో వెళితే…యవ్వనం మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పరిగెత్తుతుంది. ఓ కలలా ఇలా వచ్చి అలా వెళ్లే ఆ కాలాన్ని స్లో మోషన్ లో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు తిరుమల కిషోర్. నిజంగా ఇది చిత్రమైన థాట్. మన మిగిలిన జీవితానికి సరిపడా ఆలోచనలు, అనుభూతులు ఆ కాలేజీ రోజుల్లోనే దొరుకుతాయి. ప్రేమ, స్నేహం, బ్రేక్ అప్ ఇలా అన్నిటిని ఒకే కధలో ఇమడ్చడం కాస్త కష్టమే. అయినా ఆ పనిని ఎంతో ఇష్టంతో చేసినట్టు అనిపిస్తుంది. తిరుమల కిషోర్ ఓ దర్శకుడిగా ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కినట్టే. అతను సినిమా తీసినా అందులో జీవితం కనిపించింది. యవ్వనం గుర్తుకు వచ్చింది. బతుకు ఎలా ఉండాలో పాఠం చెప్పింది. దర్శకత్వం తర్వాత నటీనటుల గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు హీరో, హీరోయిన్ అనే కంటే నటులు అనడమే కరెక్ట్ అనిపించింది. రామ్, అనుపమ పరమేశ్వరన్, శ్రీవిష్ణు, లావణ్య త్రిపాఠి కొన్నాళ్ల పాటు మనతో వస్తారు. మనసులో తిష్ట వేస్తారు. ఎప్పటిలాగానే సోల్ వున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసింది.

ప్లస్ పాయింట్స్…

కథ
డైలాగ్స్
దర్శకత్వం
నటీనటుల ప్రతిభ
సంగీతం.

మైనస్ పాయింట్స్…

సాగతీత సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో

తెలుగు బులెట్ పంచ్ లైన్…”ఉన్నది ఒకటే జిందగీ “ మించిన ఫిలాసఫీ ఏముంది.

తెలుగు బులెట్ రేటింగ్… 3.5 /5 .