Weather report: రోజు రోజుకి తీవ్రమవుతున్న వడగాలులు.. అలర్ట్

Weather report: Hailstorms are intensifying day by day.. Alert
Weather report: Hailstorms are intensifying day by day.. Alert

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతారవణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మధ్యాహ్నం తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, ఆ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, బాలింతలు, వృద్ధులు, పిల్లలతోపాటు పక్షులపైనా ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఏర్పడే అల్పపీడనం కారణంగా.. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన వాతావరణ శాఖ తెలిపింది.