కత్తి బహిష్కరణ వెనుక ఏపీ మీద ఇంత కుట్ర ఉందా !

what is reason behind kathi mahesh hyderabad ban

ఇష్టారీతిన మాట్లాడి భావప్రకటన స్వేచ్ఛ అంటూ ముడిపెట్టే మహేష్ కత్తి పై హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తి మీద హైదరాబాద్ నగర పోలీసులు అతనిపై నగర బహిష్కరణ వేటు వేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని అతనికి హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాదులోని కత్తి మహేష్‌కు నోటీసులు ఇచ్చారు. నగరం విడిచి వెళ్లాలని, అనుమతి లేకుండా ప్రవేశించవద్దని చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా కావడంతో పోలీసులు అక్కడకి తరలించారు.

మహేష్ కత్తి హిందూ దేవతలను విమర్శించడంపై హిందూ సంఘాలు, హిందువులు, స్వామీజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. రాముడిపై అతనిది ఉన్మాదపు భావజాలమని, అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర సంకల్పించారు. చర్యలు తీసుకోకుంటే యాదాద్రిలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయన ధర్మాగ్రహం పేరుతో హైదరాబాద్ నుండి యాదద్రికి యాత్ర కూడా ప్లాన్ చేశారు. ఈసమయంలో శాంతిబద్రతలకి విఘాతం కలగోద్దనే కత్తిని ఎపీకి తరలించినట్టు అనుకుంటే దాని వెనుకున్న లాజిక్ మాత్రం ఊహకందడంలేదు అతను మాట్లాడింది చట్టప్రకారం తప్పు అయితే, అతను ఎక్కుడున్నా అది తప్పే అవుతుంది కదా చట్టప్రకారం చర్య తీసుకోకుంటే.అంటే తెలంగాణాలో తప్పు అయి, ఆంధ్రాలో ఒప్పు కాదు. ఒకవేళ తప్పు కాదు అనుకుంటే ఎక్కడా తప్పు కాదు, దానికి నగర బహిష్కరణ కూడా చేయకూడదు.

అయితే ఇందులో రాజకీయ కోణమే కన్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగు బహిష్కరణ చేసారు కాబట్టి చానెళ్ళ మైక్లు లేకుండా ఉండ లేని ఆ వ్యక్తి తిరుపతిలో మరో సారి హిందూ మతం గురించి ఏదో ఒకటి మాట్లాడటం, దానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చర్య తీసుకోవటం లేదు అని వేలెత్తి చూపాలనే వ్యూహంలా కన్పిస్తుందని భావిస్తున్నారు. ఇది బిజెపి కనుసన్నల్లో తెరాస ఆడుతున్న గేమ్ లా అనిపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ గరుడ ఆరోపణలు వస్తున్న సమయంలో ఇప్పుడు కత్తి మహేష్ ని ఏపీలో వదిలిపెట్టడం కూడా అందులో భాగమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.