రాను రాను మానవ సంబంధాలు కలుషితం అవుతున్నాయి, భార్య మీద భర్త, భర్త మీద భార్య కూడా భవిష్యత్తులో నమ్మకాలూ పెట్టుకోలేని రోజులు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే భార్యలకి తెలీకుండా వివాహేతర సంబంధాలు సాగిస్తున్న భర్తలు, భర్తలకి తెలీకుండా ఆ సంబంధాలు సాగిస్తున్న భార్యలు ఎక్కువయి పోయారు. తమ కోరికలు తీర్చుకోవటానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఎంతో మురిపెంగా చూసుకున్న భర్తను మోసం చేసి మరో వ్యక్తితో మహిళ ప్రియుడితో రొమాన్స్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా భర్తకు పట్టుపడిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం కువైట్‌లో ఒక కంపెనీ నిర్వహిస్తున్న నగరానికి చెందిన గోపిశెట్టి శ్రీధర్ అనే వ్యక్తి ఫిలింనగర్‌లోని అపర్ణ సినార్ వ్యాలీలో తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నారు. అయితే ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్ కుమార్ అనే వ్యక్తిని పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా నియమించుకుంది. ప్రతిరోజూ రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి రాకేష్ వ్యాయామం చేయించేవాడు. అయితే శ్రీధర్ పని మీద కువైట్ వెళ్ళిన సమయంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
రెండు నెలలుగా శ్రీధర్ కంపెనీ బాద్యతల దృష్ట్యా కువైట్ లో ఉండగా రాకేష్ పూర్తిగా ఆయన ఇంట్లోనే ఉంటూ అతని భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నట్లు కుమార్తెల ద్వారా తెలిసింది. రెండు రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చిన శ్రీధర్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భార్యని ఇంటి నుండి బయటకి గెంటేశాడు. అయితే అప్పటికే తన డబ్బుతో వారిద్దరూ కలిసి ఓ సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ప్రారంభించినట్లు తెలుసుకుని పోలీసులని ఆశ్రయించాడు.