పల్లవి ప్రశాంత్ తో రతిక లవ్ ట్రాక్ నడిపిస్తుందా ?

పల్లవి ప్రశాంత్ తో రతిక లవ్ ట్రాక్ నడిపిస్తుందా ?
Latest News

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతవారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైంది. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రారంభమైన వారం రోజుల్లోనే ప్రేమ జంట తయారయ్యింది. ప్రతి ఒక్క సీజన్ లో ఇలాంటివి చాలా కామన్. కానీ ఈ సీజన్లో మాత్రం వారం రోజుల్లోనే ప్రేమించుకోవడం చాలా విశేషంగా ఉంది. అది ఎవరో కాదు పల్లవి ప్రశాంత్, రతిక. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్ తో రతిక లవ్ ట్రాక్ నడిపిస్తుందా ?
Pallavi Prasanth, Rathika

హౌస్ లో కూడా ఉన్న వారంతా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫామ్ చేసేసారు. రతిక ఇప్పటికే లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న విషయం మనకి తెలిసిందే. హౌస్ లోకి వచ్చిన తర్వాత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడని బాధపడిన విషయం తెలిసిందే. ఓవైపు తన గురించి ఆలోచిస్తూనే మరోవైపు పల్లవి ప్రశాంత్ తో ప్రేమలో పడింది ఈ భామ. హౌస్ లో అందరూ ఒకవైపు ఉంటే వీరిద్దరూ మాత్రమే మరొకవైపు ఉంటారు. వీరిద్దరూ కలిసే అన్ని పనులు చేసుకుంటారు. తినడం, కలిసి కూర్చోవడం, పనులు చేసుకోవడం అన్నీ కలిసే చేస్తుంటారు. బిగ్ బాస్ కూడా వీళ్ళ లవ్ ని కన్ఫర్మ్ చేశాడు.