నగరిలో సైకిల్‌ దూకుడుకు గాలి సమస్య ..?

Will the wind withstand the bicycle aggression in the city..'?
Will the wind withstand the bicycle aggression in the city..'?

ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థితో సమస్య వస్తుందా అని వస్తుంది అని అధికార, ప్రతిపక్ష పార్టీలు కంగారు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో నగరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో మాత్రమే విజయం సాధిస్తారు. ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటికి సమాన బలాబలాలు ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలలో రెండింటిలోనూ వర్గ విభేదాలు ఉన్నాయి.

మంత్రి రోజాకు ఈసారి టికెట్ ఇవ్వద్దని ఇస్తే ఓటు వేయమని స్థానిక నేతలు అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. టిడిపి తరఫున గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు భాను ప్రకాష్ నాయుడు గత ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు. కానీ ఈసారి వైసీపీ అభ్యర్థి పై పోటీ చేసి విజయం సాధించాలని గట్టిపట్టుతో ఉన్నారు. దానికోసం నియోజకవర్గంలో తన కేడర్ ను పెంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నారు.

ఇలా ఉండగా గాలి బాను ప్రకాష్ కు సొంత ఇంటి నుండి సమస్య ఎదురయింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ తాను ఈసారి టిడిపి తరఫున పోటీ చేస్తానని, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెరపైకి వచ్చాడు. అన్నదమ్ములు ఇరువురికి వ్యక్తిగతంగా ఆస్తిపరంగా ఎప్పటినుండో వివాదాలు ఉన్నాయి. టిడిపి అభ్యర్థిగా ఇప్పటివరకు గాలి భాను ప్రకాష్‌ను నిర్ణయించారు. భాను ప్రకాష్ కి పోటీగా జగదీష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టిడిపికి నష్టమే జరుగుతుంది అని రాజకీయ వర్గాల అంచనా.

టిడిపి టికెట్ ఇచ్చినా సరే లేదా వేరే పార్టీలోనైనా, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని జగదీష్ చెప్తున్నారు. గాలి బాను ప్రకాష్ కి పోటీగా జగదీష్‌ను వైసీపీలోని ఒక కీలక నేత వెనక ఉండి నడిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

జగదీష్ ను తెరపైకి తీసుకువచ్చి ఇటు రోజాకు చెక్ పెట్టి టీడీపీకి చెక్ పెట్టవచ్చని ఆలోచనతో ఆ నేత ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. జగదీష్ పోటీ చేస్తే గాలి కుటుంబానికి టిడిపికి కలిసి ఉన్న ఓట్లను అన్నదమ్ములు ఇద్దరు పంచుకోవాలి. జగదీష్ పోటీ చేస్తే ప్రభావితం చేసేది ఐదు నుంచి పది శాతం ఓటర్లు మాత్రమే, కానీ టిడిపికి ఆ ఓట్లు కూడా ముఖ్యమే. మరి ఈసారి నగరి నియోజక వర్గం ఎన్నికల పోరు హోరాహోరీగా ఉంటుంది అని రాజకీయ వర్గాల అభిప్రాయ పడుతున్నారు.