తెలంగాణ లో మద్యం అమ్మకాలు లేవు

తెలంగాణ లో మద్యం అమ్మకాలు లేవు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రేపటి నుండి గ్రీన్ జోన్ ల పరిధి లలో మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం గట్టిగా ఉన్న నేపధ్యం మద్యం అమ్మకాలు లేవు అని సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇక మద్యం అమ్మకాలు లేవు అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే నిర్ణయం తో మందు బాబులకు గట్టి షాక్ తగిలినట్టు అయింది. ఇప్పటికే మద్యం అమ్మకాలు లేక పలు చోట్ల తామే స్వంతం గా తయారు చేసుకొని అనారోగ్యం పాలు అయ్యారు. అంతేకాక కొందరు మరణించారు. మద్యానికి బానిసలు అయిన కొందరు తమ ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకున్నాయి అని చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపధ్యంలో లో మందుబాబులకు ఊరట లభించింది అని అనుకున్న సమయానికి, రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా రంగాలు దెబ్బతిన్నాయి. విపరీతంగా ఆర్ధిక వ్యవస్థ నష్టపోయింది. అయినప్పటి కి ఏ ఒక్కరికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ మద్యం అమ్మకాలు లేక పోవడం కూడా కరోనా వైరస్ ప్రభల కుండ ఉండేందుకు తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.