ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్న అల్లు అర్జున్ మ్యానియా

ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్న అల్లు అర్జున్ మ్యానియా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ్యానియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉంది. అలా వైకుంఠ పురంలో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాకుండా, ఈ చిత్రం అలజడి భారత్ అంతటా వ్యాప్తి చెందింది. అయితే ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. అయితే సుకుమార్ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడినప్పటికీ డబుల్ ఎనర్జీ తో చిత్ర యూనిట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టటింగ్ అప్డేట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

సుకుమార్ ఈ చిత్రంలో ఒక భారీ ఫైట్ ను చిత్రీకరించనున్నారు. అయితే ఈ ఫైట్ కోసం సుకుమార్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ప్రిఫర్ చేశాడట. అయితే అది కాస్త ఇపుడు పీటర్ హెయిన్స్ మరియు కనల్ కన్నన్ లతో పూర్తి చేయనున్నాడట. అయితే ఈ భారీ ఫైట్ కోసం అక్షరాల 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్ గా తీసే అవకాశం ఉంది. ఒక్క ఫైట్ కోసమే సుకుమార్ ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం తో స్టోరీ లైన్ పై, సినిమా ఔట్ పుట్ పై అంత నమ్మకం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప ఫస్ట్ లుక్ తోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు ఆకర్షించిన బన్నీ ఈ చిత్రం తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగే అవకాశం ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.