ఈ చిత్రంలో ఇక హీరోయిన్ కాజలే

ఈ చిత్రంలో ఇక హీరోయిన్ కాజలే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఈ మధ్యనే చాలా విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం మొదలు పెట్టాయి. వాటి బాటలోనే తాజాగా మరో పుకారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మొదట రే సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకోగా ఆమె కాస్తా అప్పుడు తప్పుకుంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ స్థానాన్ని హీరోయిన్ కాజల్ భర్తీ చేసింది అని ఖరారు అయ్యింది. కానీ మళ్ళీ కాజల్ షాకిస్తూ ఈ చిత్రం నుంచి తప్పుకుంది అని పుకార్లు వచ్చాయి.

కానీ అవేవి అసలు నిజం కాదని కాజల్ కొట్టిపడినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రంలో ఇక హీరోయిన్ కాజలే అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోవచ్చు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.