పది రోజుల్లోనే భారత్ గడ్డపై మరో టెస్టు సిరీస్‌

పది రోజుల్లోనే భారత్ గడ్డపై మరో టెస్టు సిరీస్‌

భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌ల షెడ్యూల్ నవంబరు 3 నుంచి 26 వరకూ ఖరారు అయింది. బంగ్లాదేశ్ టీ20 జట్టుని ప్రకటించిగా ఈనెల 24న భారత్ జట్టుని ప్రకటించబోనున్నది.సఫారీలతో ఆఖరి టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ఆడనున్న భారత్ జట్టు టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లో ఆడబోనున్నది.

తొలి టీ20 మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ 7న, నాగ్‌పూర్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ 10న జరగబోనున్నాయి. ఇండోర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ నవంబరు 14న, ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు 22నుంచి కోల్‌కతాలో జరగబోనున్నాయి. మొదటజరిగే టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్ ఇప్పటికే క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. ఈ నెల 24న భారత్ జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించబోనున్నారు.