బతుకమ్మ సంబరాలలో అపశృతి

బతుకమ్మ సంబరాలలో అపశృతి

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గునుగు, తంగేడు, సీతాకుచ్చులతో ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటున్నారుబాగా అలంకరించుకొని యువతీ , మహిళలు, చిన్న పిల్లలు సంబరంగా కలిసి ఆడుకునే పండగ ఇదే. నిన్న చిన్న బతుకమ్మ ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ఈ పండగ రోజు నిజాం పేట్ లో అపశృతి జరిగింది. హైదరాబాద్‌లో నిజాంపేట్ లో విషాదం చోటుచేసుకుంది.

బతుకమ్మ పండుగలో అపశృతి జరిగింది. ఒక మహిళ గుండెపోటుతో మరణించింది. బతుకమ్మ పండగ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ముఖ్యమైనది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో ఒక మహిళ ఎంతో సంబరంగా, సంతోషంతో బతుకమ్మ అడుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఆ మహిళా గుండెపోటుతో ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయింది. వెంటనే చుట్టుప్రక్కల ఉన్న మహిళలు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.