తనకన్నా పదేళ్ల చిన్నవాడితో అక్రమ సంబంధం, భర్త కళ్ళుగప్పి గోవాకి !

Woman Illegal affair with a man and going to Goa

భర్త, ఇద్దరు కూతుళ్లున్న ఓ వివాహిత తనకంటే పదేళ్ళ చిన్నవాడయిన మరొకరితో సంబంధం పెట్టుకుని బజారును పడింది. వివాహేతర సంబంధం నెరపుతున్న సదరు మహిళపై ఎస్.ఆర్. నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ఒక కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన వ్యాపార నిమిత్తం తరుచూ నెల్లూరు, విజయవాడకు వెళ్తుంటాడు. ఆయన లేని సమయంలో ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు అవివాహితుడైన ఆ షాపు యజమాని మాధవ్(25)తో పరిచయం ఏర్పడింది. ఆవిడ కంటే మాధవ్ వయసులో 10 ఏళ్లు చిన్నవాడు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి ధ్యాసలో భర్త, పిల్లల్ని సైతం పట్టించుకునేది కాదు.

ఓ రోజూ అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులో ఒక ఫ్లాట్ లో కలుసుకున్న వీరిద్దరిని భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే అప్పటి నుంచి తాను మారుతానని… తప్పుడు పనులేవీ చేయబోనని భర్తను వేడుకుంది ఈమేరకు ప్రమాణం కూడా చేసింది. అయినా మారని ఆ వివాహిత కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పింది కానీ తన ప్రియుడు మాధవ్‌ను కారులో ఎక్కించుకుని గోవాకు ఎంజాయ్ చేసేందుకు వెళ్ళింది. అయితే దీన్ని ముందే అనుమానించిన భర్త భార్య కారుకు జియో ట్యాగ్ అమర్చాడు. దీంతో తన భార్య గోవాలోని ఓ హోటల్‌లో ఉందని… తనను అరెస్ట్ చేయాలని… ఎస్‌ ఆర్‌ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తనను మోసం చేసిన తన భార్యపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని… తన కూతుళ్లను తనదగ్గరే పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ… పోలీసులికిచ్చిన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.